23.9 C
Hyderabad
September 27, 2026
ప్రత్యేకంహోమ్

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

#Amaravati

అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని నగరంలో భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో అమరావతికి వరాల జల్లు కురిసినట్లైంది. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతిని జాతీయ స్థాయి పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పురోగతి సాధించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామోడేషన్ (జీపీఆర్‌ఏ) ప్రాజెక్టును అమరావతిలో నిర్మించనున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు చేపట్టబడనుంది. ఇందులో మొత్తం 11 భారీ టవర్లలో 1,504 అత్యాధునిక నివాస ఫ్లాట్లు నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ గృహ సముదాయాలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే 1,972 కార్లు నిలిపే సామర్థ్యంతో భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇదే సమయంలో అమరావతిలో రూ.1,299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ (సీజీవో) కాంప్లెక్స్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. చతురస్రాకార నమూనాలో రూపుదిద్దుకోనున్న ఈ సముదాయం 5.53 ఎకరాల విస్తీర్ణంలో రెండు భారీ బ్లాక్‌లుగా నిర్మించబడుతుంది.

మొత్తం 23.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 మరియు 13 అంతస్తుల అత్యాధునిక భవనాలు నిర్మించనున్నారు. సుమారు 8 వేల మంది ఉద్యోగులు ఒకేసారి పనిచేసేలా కార్యాలయ సదుపాయాలు కల్పించనున్నారు. అదనంగా 1,800 కార్ల పార్కింగ్ సౌకర్యంతో పాటు బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీస్ వంటి సేవలను కూడా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనున్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా భవనాల రూపకల్పన చేపట్టనున్నారు. శక్తి పొదుపు, నీటి సంరక్షణ, సహజ కాంతి వినియోగం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే జీఆర్ఐహెచ్‌ఏ 4-స్టార్ రేటింగ్ సాధించే లక్ష్యంతో నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తున్నారు.

దివ్యాంగులకు అనుకూలంగా బారియర్-ఫ్రీ వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. వీల్‌చైర్ సౌకర్యాలు, ప్రత్యేక మార్గాలు, లిఫ్టులు, అందుబాటులో ఉండే మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారడంతో పాటు రాజధాని అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

 

Related posts

ప్రేమ.. దొంగ పెళ్లి… చివరకు విషాదం..

Satyam News

మోదీ సభ కోసం కేంద్ర మంత్రి వాల్ రైటింగ్

Satyam News

హిజాబ్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదే…

Satyam News

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

Satyam News

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News

Leave a Comment