26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

ప్రధాని మోడీ అవతార పురుషుడు

#Pragnanada

ప్రపంచ దేశాలన్నీ జూన్ 21 యోగా జరపడానికి కారణం ప్రధాని మోడీ అని, మోడి అవతార పురుషుడని శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి, శ్రీ స్వామి అంతర్ముఖానంద( డా.శ్రీగురూజీ) అన్నారు. విజయనగరం జిల్లా కామన్నవలస ఆశ్రమంలో  అపర వాల్మీకి జగద్గురు శ్రీ స్వామి శివానంద పరమ హంసల వారి జయంతి సందర్బంగా శ్రీ గురూజీ అన్నారు.

యోగ అంటే ఆసనాలతో పాటు ఉచ్ఛాస, నిశ్వాసలను రాపిడి చేయడమే యోగమని అదే ప్రాణాయామం అని శ్రీగరూజీ అన్నారు. నేడు ప్రపంచం యావత్తు ఆధ్యాత్మిక చింతనలో పయనిస్తోందని అందుకు ప్రధాని మోడీ జూన్ 21  ప్రవేశ పెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణమన్నారు.

ప్రతీ ఒక్కరూ యాంత్రిక జీవనంలో పడి శ్వాసను నిర్వీర్యం చేసుకుంటున్నారని, ఈ యోగా దినోత్సవం సందర్బంగా ప్రాణాయామం విద్యను పొంది నిరంతరం సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్య వంతులు అవుతారని శ్రీగురూజీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శివ, మోహన్ రావు, శోభ, సూర్యనారాయణ, ఘాన్సీ, డా. సుబ్రహ్మణ్యం, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, డా. హరగోపాల్ లతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచీ అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు.

Related posts

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

అమరావతి శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు

Satyam News

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

Satyam News

భారతి సిమెంట్స్‌ మోసం…. న్యాయం కోసం బాధితుల పోరు

Satyam News

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి బాధ!

Satyam News

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News

Leave a Comment