మూడు పార్టీల సమన్వయంతో ప్రతినెల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాజంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. కడప జిల్లా రాజంపేట ఏపీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో కూటమి పార్టీ రెండేళ్ల పాలనపై నిర్వహించిన విజయోత్సవ సభ లో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని తెలిపారు .ఈ నేపథ్యంలో కొంతమంది గొడ్డలి పార్టీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని ముక్కలుగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అటువంటి వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అన్నమయ్య ప్రాజెక్టును త్వరలోనే పునర్నిర్మించి రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు.
కూటమి పార్టీలోని నాయకులకు కార్యకర్తలకు పై వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అధఃపాతాళానికి తొక్కేస్తామని గట్టిగా హెచ్చరించారు. జనసేన నాయకులు అతికారి కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా మా నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి నాంది పలికాలని తెలిపారు.
ప్రధాని మోడీ సారధ్యంలో అభివృద్ధి తధ్యం
నియోజవర్గ ఇన్చార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అన్నివేళలా ముందు ఉంటామని తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకులు నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ లు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పార్టీల అభ్యర్థుల విజయానికి కూటమిలోని నాయకులు కార్యకర్తలు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మోదుగుల పెంచలయ్య మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే ఒంటిమిట్ట ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి చిహ్నంగా తాను ఒంటిమిట్టలో నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు కాంశ్య విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని సభా మూలకంగా హామీ ఇచ్చారు. దీంతో సభలో కూర్చున్న వారందరూ చప్పట్లతో ఆయనను అభినందించారు. తాసిల్దార్ దస్తగిరి మాట్లాడుతూ గల్ఫ్ దేశాల యుద్ధం కారణంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సమస్య వస్తే రెవెన్యూ శాఖ అధికారులు పరుగులు తీయించి ఒక్క రోజులోనే ఆ సమస్యను పరిష్కరించిన ఘనత చంద్రబాబు నాయుడుని చెప్పారు.
ఎంపీడీవో వరప్రసాద్ మాట్లాడుతూ రాజం పేట మండలంలోని ప్రతి నెల మూడు కోట్ల 26 లక్షల రూపాయలు నగదును పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. అంతకు ముందుగా పలువురు కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రసంగించి వైసిపి నాయకుల అరాచకాలను ఎండగట్టారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పారా సుబ్బా నాయుడు, ఎద్దుల సుబ్బరాయుడు, డాక్టర్ సుధాకర్, గన్నె సుబ్బ నరసయ్య నాయుడు, టి. లక్ష్మీనారాయణ, అద్దేపల్లి ప్రతాప్ రాజు, డాక్టర్ నవీన్ చంద్ర, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణా రెడ్డి, మహేష్ రాజు, రాంనగర్ నరసింహ, నంజీవరావు, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్ట దీవుడు, రమేష్ నాయక్, చల్లా సుధాకర్ లతోపాటు నియోజకవర్గంలోని కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
