30.1 C
Hyderabad
September 27, 2026
సంపాదకీయంహోమ్

జగన్‌ మత ఉగ్రవాది…..  బాంబు పేల్చిన విజయసాయి!

#VijaysaiReddy

ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ నేత విజయసాయి రెడ్డి ఆ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా తన మాజీ బాస్ జగన్ రాజకీయ వ్యూహాలను, వైసీపీ ధోరణిని పూర్తిగా కడిగిపారేశారు. ఇటీవల తిరుపతి లడ్డూ వివాదం, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఇటీవల హిందూ సంస్కృతిపై, సనాతన ధర్మంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరియు రావణ్ వంటి వారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వైసీపీ సమర్థించడాన్ని జగన్ మాజీ ఆప్తుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా వీరిని సమర్థించటం, హైలైట్ చేయటం అంటే… అది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. జగన్ నీడలా నిలిచిన విజయసాయి రెడ్డే ఇప్పుడు వైసీపీ హిందూ వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని ఓపెన్‌గా విమర్శించడం ఆ పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసింది.

మత మార్పిడులు, కుల రాజకీయాల వెనుక ఉన్న అసలు రంగును బయటపెడుతూ విజయసాయి రెడ్డి మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది మతం మారిన తర్వాత కూడా ఆర్థిక, రాజకీయ లాభాల కోసం కుల పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లోని క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మ వారేనని చెప్తూ…సూట్ బూటు ధరించి, సగం ఇంగ్లీష్‌తో హిందూ సంస్కృతిపై, దేశ సార్వభౌమత్వంపై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు.

భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఇలాంటి కుట్రలను మతపరమైన ఉగ్రవాదంగా భావించాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మన దేవతలపై, హిందూ మతంపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించేలా చట్టాలు సవరించాలని, చట్టంతో పాటు సమాజం కూడా వీరిని వెలివేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘ విద్రోహ కుట్రలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా, విజయసాయి రెడ్డి వేసిన ఈ పొలిటికల్ బాంబుతో వైసీపీ శ్రేణులు షాక్‌లో మునిగిపోయాయి.

Related posts

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

స్థానిక ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలలో పోటీకి సిద్ధం

Satyam News

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

Leave a Comment