క్రీడలుహోమ్

తరుణ్ మానేపల్లికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

#Srihari

ఆసియా క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు తరుణ్ మానేపల్లిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయం లో తరుణ్ మంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు.

అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటి పతకం సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. తరుణ్ మానేపల్లి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తి అని అభివర్ణించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

తెలంగాణలో క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. భవిష్యత్తులో తరుణ్ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Related posts

ప్రధాని మోడీ రోడ్ షోతో దద్దరిల్లిన వారణాసి

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

తిరుమల కొండపై ఒక విలేఖరి ఆక్రమణలు

Satyam News

కార్యకర్తలకు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి

Satyam News

ఏప్రిల్ 3న రాబోతోన్న ‘రాకాస’

Satyam News

దేవుడి భూములకే ఎసరు పెట్టిన పేర్ని నాని!

Satyam News

Leave a Comment