25.7 C
Hyderabad
September 24, 2026
మహబూబ్ నగర్హోమ్

జూరాల ఆయకట్టుకు వారాబందీతో సాగునీరు

#JupalliKrishnarao

జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారాబందీ విధానంలో సాగునీటిని అందిస్తామని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని తెలిపారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశం నిర్వహించారు. జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి విడుదల, నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలు, పంటలకు నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుత నీటి పరిస్థితిపై అధికారుల నుంచి వివరాలు తీసుకుని, రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రైతులపై నిజమైన ప్రేమ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందన్నారు. రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కృష్ణా నదిలో నీటి లభ్యత, జూరాల ఆయకట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారాబందీ పద్ధతిలో సాగునీటిని అందిస్తామని తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై తగిన శ్రద్ధ చూపలేదని మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ వద్ద ఒక్క పంపును ఆన్ చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రచారం చేశారని ఆరోపించారు. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం గతంలో వరద నీటిని వినియోగించడంపై, కృష్ణా–భీమా నదులపై అవసరమైన బ్యారేజీల నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి జూరాలకు నీటిని తీసుకురావడంపై ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టిందని, అయితే దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రైతులకు సాగునీటిని వారాబందీలో ఇస్తామన్నారు.రైతులను కాపాడుకునే బాధ్యత మాదని తేల్చి చెప్పారు . జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వమని,వచ్చే వేసవిలో తాగునీటి సమస్య రాకుండా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

జూరాల ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతను ప్రస్తావిస్తూ, భారీ వరద ప్రవాహాలు వచ్చిన సందర్భాల్లోనూ ప్రాజెక్టు నిలకడగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Related posts

తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా

Satyam News

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Satyam News

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

Satyam News

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

Satyam News

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి!

Satyam News

Leave a Comment