మహబూబ్ నగర్హోమ్

చిమ్మ చీకట్లో ఐజ ప్రభుత్వ ఆసుపత్రి

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది అయిజ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాన్పులకు మొదటి స్థానంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక చొరవ చూపని అధికారుల వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెల రోజులుగా ఆస్పత్రి బయట విద్యుత్ వెలుగులు లేక పాములకు అడ్డాగా మారింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి పై పర్యవేక్షణ కరువై ఆసుపత్రి లోపల ఫ్యాన్లు పనిచేయడం లేదు. ఆస్పత్రిలో పనిచేసే మెడికల్ ఆఫీసర్ ఎందుకు దృష్టి పెట్టడం లేదు అర్థం కావడం లేదు.

రాత్రి వేళలో వచ్చే రోగులకు, నిండు గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి వస్తే చిమ్మ చీకట్లో పాములు,పురుగులకు అడ్డాగా మారడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. రోగులకు గర్భిణీలకు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది.

తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక చొరవ చూపి ఆసుపత్రి లోపల ఉన్న విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ కూడా లైట్లు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

మనం మరింత బాధ్యత గా ఉండాలి

Satyam News

కాటన్ ఆశయాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి

Satyam News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News

Leave a Comment