ముఖ్యంశాలుహోమ్

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

#SIR

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియపై పవన్ కుమార్ శర్మ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు(డిఇఓలు), ఓటరు జాబితా పరిశీలకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజెషన్ ప్రక్రియలను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రత్యేకంగా ఆదేశించారు.

సర్ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరును కనబరిచిన జిల్లాల ఎన్నికల అధికారులతో కమిషన్ మాట్లాడి, వారు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను  తెలుసుకుంది. ఆ వ్యూహాలను ఇతర జిల్లాలు కూడా అమలు చేసి, ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసి చేయాలని ఆదేశించారు.

అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి భారత ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో SIR 2026 ప్రక్రియను నిర్ణీత సమయంలో విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Related posts

రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు మరో రిక్వెస్టు

Satyam News

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News

శ్రీశైలం లో ఉగాది మహోత్సవములు ప్రారంభం

Satyam News

Leave a Comment