26.7 C
Hyderabad
September 20, 2026
సంపాదకీయంహోమ్

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

#Jagan

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై ఇటీవల ఆయన తల్లి విజయలక్ష్మి విడుదల చేసిన నోటరీ అఫిడవిట్ ప్రకంపనలు సృష్టించింది. మామూలుగా స్కూలు మారేప్పుడు విద్యా సంస్థలు ప్రవర్తన సర్టిఫికేట్ (కండక్ట్ సర్టిఫికేట్) ఇస్తాయి. కానీ దేశంలో మొదటిసారి ఒక తల్లి, కొడుకు చేసిన మోసం మీద అఫిడవిట్ ఇచ్చింది.

అందులో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు ఆస్తులు పంచలేదని ఆరోపించారు. కేవలం డివిడెండ్ మాత్రమే ఇచ్చారని, అదేమన్నా ధర్మానికి ఇచ్చాడా అన్నట్లు ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఉంటున్నారు అని అర్థం వచ్చేలా.. ప్రస్తుతం జగన్ ఉంటున్న బెంగళూరు యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదే అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అది జగన్‌కు ఆగ్రహం తెప్పించినట్లుంది. లోటస్‌పాండ్‌లో ఉన్న చెల్లిని, తల్లిని నేరుగా గెంటేయలేడు. కానీ తాను అక్కడికి వెళితే, వారు ప్రాణ భయంతో వారే ఖాళీ చేస్తారని ‘దండయాత్ర’కు ముహూర్తం పెట్టినట్లుగా ఇటీవల వస్తున్న వార్తలను బట్టి తెలుస్తున్నదా.

ఇటీవల చెల్లి, పెళ్లాం అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన పోలికల మీద పెద్ద దుమారం రేగింది. అది మరిచిపోకముందే తాను లోటస్‌పాండ్ మీద దండయాత్ర చేస్తే.. వైఎస్ఆర్ అభిమానులు కూడా పైకి చెప్పకపోయినా మనసులో అసహ్యించుకుంటారని, ఛీత్కరించుకుంటారని తెలుసు. అందుకే వారిని మానసికంగా సిద్ధం చేస్తూ ముందుగా మీడియాకు లీకులు ఇచ్చారు. “జగన్ స్కెచ్”, “లోటస్‌పాండ్ అచ్చి వచ్చింది” (అంతకు ముందు ఓడిపోయినా), “అభిమానులను కలవడానికి” అంటూ విశ్లేషణలు చేయిస్తూ ముందుకు వెళుతున్నారు.

దండయాత్ర మొదలవ్వగానే భయంతో తల్లి, చెల్లి ఖాళీ చేయక తప్పదు. షర్మిలకు చెందిన బెంగళూరు యలహంక ప్యాలెస్, ఆమెకి ఇచ్చేస్తే, ప్యాలెస్ మార్చడానికి చెప్పే కలరింగ్‌లు (కారణాలు) సరిపోతాయి. అలా కాకుండా చేస్తే తల్లికి, చెల్లికి నిలువ నీడ కూడా లేకుండా చేశాడని జనం భావిస్తారు. కానీ వైసీపీ అభిమానులు మాత్రం ‘అమ్మ అఫిడవిట్ మీద అన్న పగ సాధించి గెలిచాడు’ అని సంబరాలు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Related posts

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

Satyam News

జీసీసీ పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పరిశీలన

Satyam News

మనం ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరోకు ఘన సత్కారం

Satyam News

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News

Leave a Comment