ప్రపంచంహోమ్

భీకర దాడుల్లో అమెరికా కు భారీ నష్టం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్ దీవి, బందర్ అబ్బాస్, మరియు బుషెహర్ రేవు పట్టణాలపై శత్రు దేశాలు భారీ వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలతో పాటు నౌకాదళ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాన్‌ను ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీసే వ్యూహంతోనే ఈ రేవు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆకస్మిక దాడులతో ఇరాన్ సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

మరోవైపు ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జేసీ) పొరుగునే ఉన్న కువైట్‌పై భీకర దాడులు నిర్వహించింది. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐఆర్ జేసీ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో అక్కడ మోహరించిన అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన అత్యాధునిక అటాకామ్స్ (ATACMS) క్షిపణి వ్యవస్థ ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు.

ఇరాన్ మరియు అమెరికా మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కువైట్‌లోని తమ స్థావరాలపై జరిగిన దాడి మరియు సైనికుల మృతిని అమెరికా రక్షణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

Related posts

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

Satyam News

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

విత్తన పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆఫ్రికా ప్రతినిధులు

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Satyam News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

Leave a Comment