26.3 C
Hyderabad
September 27, 2026
ప్రపంచంహోమ్

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

#HafeezSayeed

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది.

ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ ప్రధానుడు హఫీజ్ సయీద్‌ను అనుబంధ అభియోగపత్రంలో నిందితుడిగా చేర్చింది. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక సరిహద్దు దాటి జరిగిన కుట్రకు హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని సంస్థ వెల్లడించింది.

దర్యాప్తు సంస్థ వివరాల ప్రకారం, ఉగ్రదాడి ప్రణాళిక, అమలు, సమన్వయంలో లష్కరే తోయిబా కీలక పాత్ర పోషించిందని సేకరించిన ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ కుట్రకు సంబంధించి పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద నాయకత్వం నుంచి మార్గనిర్దేశం జరిగిందని అభియోగపత్రంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్‌పై అధికారికంగా అభియోగాలు నమోదు చేయడం దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో దాఖలైన ప్రధాన అభియోగపత్రంలో లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ, పలువురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తుల పేర్లను చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ, తాజా అనుబంధ అభియోగపత్రంలో హఫీజ్ సయీద్‌ను కూడా నిందితుడిగా చేర్చింది. దాడికి సంబంధించిన కుట్ర పాకిస్థాన్‌లో రూపుదిద్దుకున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

పహల్గామ్‌లో జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. దర్యాప్తు సందర్భంగా సేకరించిన సాంకేతిక, నిఘా ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా సరిహద్దు దాటి జరిగిన ఉగ్రకుట్రను నిర్ధారించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో భాగమైన ఇతర వ్యక్తుల పాత్రపైనా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

జొన్న‌గుడ్డిలో కార్డ‌న్ సెర్చ్‌: ఆరుగురిపై స‌స్పెక్ట్స్ షీట్స్‌

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

ఇరాన్ పై బీ 2 స్టిల్త్ బాంబర్ల ప్రయోగం

Satyam News

Leave a Comment