హైదరాబాద్ హోమ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం

#JubileeHills

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. ఈ నెల 14 వ తేదీన ఎన్నిక కౌంటింగ్ నేపథ్యంలో గురువారం యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ మీడియా సెంటర్ లో పాత్రికేయులకు కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. నోటా తో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈసీఐ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గరిష్టంగా 10 రౌండ్ లు చేస్తారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, ఈసీఐ బృందం పరిశీలిస్తారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో కౌంటింగ్ సూపర్ వైజర్ లు, కౌంటింగ్ అసిస్టెంట్ లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారని అన్నారు.

LED స్క్రీన్ ద్వారా, EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్ లకు  మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు.

జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ రేపు కౌంటింగ్ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని, రేపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం, విజిలెన్స్ అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దీపావళి సోమవారమా? మంగళవారమా?

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

Satyam News

Leave a Comment

error: Content is protected !!