26.5 C
Hyderabad
September 10, 2026
నిజామాబాద్హోమ్

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాట భేరి

#KalvakuntlaKavita

హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్‌ భవన్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా కవిత ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. కవిత మాట్లాడుతూ, 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో 1,300 మంది డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొన్నారు.

వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. గతంలోనే 491 మంది కార్మికులను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, ఇప్పటికీ వారిని పునరుద్ధరించలేదని ఎండీతో సమావేశం అనంతరం తెలిసిందని చెప్పారు. వెంటనే ఆ 491 మందిని విధుల్లోకి తీసుకోవాలని, మిగతా కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆర్టీసీలో ప్రస్తుతం హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నారని, అయితే వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి ఎలాంటి నియంత్రణ లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. హైర్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్ల చేతనే నడపేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. “ప్రైవేటు డ్రైవర్ల వల్ల ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నించారు.

అలాగే, ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కవిత కోరారు. “ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతేనే ప్రజలకు భద్రమైన ప్రయాణం, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది” అని ఆమె అన్నారు.

Related posts

కోల్ కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Satyam News

గ్రేటర్‌ అమరావతి…. మరో 20 వేల ఎకరాల భూముల సేకరణ…!!

Satyam News

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Satyam News

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

Satyam News

మరో చార్జిషీట్ దాఖలు చేసిన సిట్

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

Leave a Comment