ముఖ్యంశాలుహోమ్

దేశంలోనే మొదటి డిజిటల్‌.. ఏఐ ప్లస్ క్యాంపస్..

#ChandrababuN

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రముఖ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. బిర్లా గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ  బిట్స్ పిలానీ కొత్త క్యాంపస్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు.

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ ప్రాంగణాన్ని ఐదేళ్లలో రెండు వేల కోట్ల వ్యయంతో మూడు దశల్లో అభివృద్ధి చేస్తామని సంస్థ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. ఇక్కడ మొత్తం 10 వేల మంది విద్యార్ధులు చదువుకొనే అవకాశం ఉంటుంది. 2027 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి.

అమరావతి బిట్స్‌ క్యాంపస్‌లో ఏఐతో పాటు ఎమర్జింగ్‌ టెక్నాజీలపై కోర్సులు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. అకడమిక్‌ నాలెడ్జ్‌కి తోడు ఇండస్ట్రీలతో కొలాబరేషన్‌ ద్వారా ప్రాక్టికల్‌ రియల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం ఈ క్యాంపస్ ప్రత్యేకత. ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీలతో కలిసి జాయింట్‌ పీహెచ్‌డీ కోర్సులు ఆఫర్‌ చేస్తారు.

అమరావతిలో రెండేళ్లు.. ఫారిన్‌ యూనివర్శిటీలో మరో రెండేళ్లు చదివే డ్యూయల్‌ డిగ్రీలను అందించనున్నారు. ప్రాజెక్ట్‌లు చేయడం ద్వారా నేర్చుకోవడం, ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ వంటి ప్రోగ్రామ్స్‌తో ఇంజనీర్లను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే కోర్సులను ప్రవేశపెడుతున్నారు.

అమరావతిలో నిర్మిస్తున్న బిట్స్ పిలానీ క్యాంపస్‌..  గ్రీన్ బిల్డింగ్స్, రెన్యువబుల్ ఎనర్జీ సిస్టమ్స్‌తో పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది. డిజిటల్‌ ఫస్ట్‌, ఐఓటీ ఎనేబుల్డ్‌ సిస్టమ్స్‌తో మన దేశంలోనే తొలి అధునాత క్యాంపస్‌గా నిలవనుంది. నెక్ట్స్ జనరేషన్‌ టాలెంట్‌ను సానబెట్టి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే ఇంజనీర్లను తయారు చేస్తామంటున్నారు సంస్థ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా.

అమరావతిలో ఇప్పటికే వీఐటీ, ఎస్ఆర్ఎం, అమృత వంటి ప్రముఖ యూనివర్శిటీలు నడుస్తున్నాయి. 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇవి అమరావతికి వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అమరావతిలో పనులు ఆపేయడమే కాకుండా అభివృద్ధిని పక్కన పెట్టారు.

2024లో కూటమి సర్కారు పాలన ప్రారంభమైన తర్వాత మళ్లీ అమరావతికి మంచి రోజులు వచ్చాయి. ఈ రెండేళ్లలో ఎక్స్‌ఎల్‌ఆరై, బిట్స్ వంటి ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు నల్సార్ విశ్వవిద్యాలయం రాజధాని ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి.

Related posts

వైసీపీ ఫేస్ బుక్ పేజీ ని బ్లాక్ చేసిన మెటా

Satyam News

కలెక్టర్ హిమాన్షు చర్యలతో మత్స్యకారుల్లో విశ్వాసం

Satyam News

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

Satyam News

Leave a Comment