కృష్ణహోమ్

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

#APPolice

సస్పెన్షన్ బాధతో విజయవాడ నగర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఒక ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదకర సంఘటన నేడిక్కడ జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపి ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం పెదపులిపాక సమీపంలో ఆయన మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉండగా, చివరకు ఆయన మృతదేహం లభ్యమైంది. ఇటీవల ఒక కేసు విషయంలో వచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ క్రమంలో గోపిపై సస్పెన్షన్ వేటు వేశారు.

విధి నిర్వహణలో ఉన్న అధికారిగా సస్పెన్షన్ కు గురవ్వడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని తెలుస్తోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. గోపి ఆత్మహత్యకు పాల్పడటానికి రెండు రోజుల ముందే ఒక సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం.

ఆ లేఖలో తన ఆవేదనను, సస్పెన్షన్ కు దారితీసిన పరిస్థితులను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకుని, అందులోని అంశాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఎస్సై గోపికి భార్య ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఇలా అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పెదపులిపాక వద్ద మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Related posts

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం నిజమేనా…?

Satyam News

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

Satyam News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

Satyam News

Leave a Comment