26.7 C
Hyderabad
September 20, 2026
శ్రీకాకుళంహోమ్

నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడుకు మేత

#GanjiEzra

నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడు పదునెక్కుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు, దామోదర్ సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ప్రెసిడెంటు డా.గంజి ఆర్ ఎజ్రా తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీలో క్రిస్మస్ పెస్టివల్ ను పురస్కరించుకుని 209 వ చెన్ టోర్నీ ను ఉత్సాహంగా నిర్వహించారు.

5 రౌండ్లపాటు జరిగిన చెస్ పోటీలలో చెస్ క్రీడాకారులు అసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధావుల క్రీడ అని అలాంటి క్రీడలో జిల్లా చిన్నారులు పాల్గొని చెస్ ను నేర్చుకోవడం, పోటీలలో రాణిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గంజి ఆర్ ఎజ్రా దంపతులు క్రిస్మస్ పండగ విశేషాలను, చదువు, క్రీడల ప్రాముఖ్యాన్ని వివరించారు.

అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిడే రేటింగ్ చెస్ ప్లేయర్, స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీ కోచ్ భేరి చిన్నారావు, చెస్ కోచ్ కె.సాయినిరంజన్ సింగ్, చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజేతలుగా- 5 విజయాలతో టోర్నీ విజేతగా తంగి సూర్య, సత్తాచాటగా, 4 విజయాలతో ఏ ప్రసాద్, వి రోషిణి, కరణం రోహన్, జి యశ్వంత్ ప్రతాప్, తరువాత స్థానాలలో విజేతలగా నిలిచారు.

తరువాత స్థానాలలో బలివాడ జయంత్, ఎన్ సాయి కౌశిక్, ఎంఎస్కె రేవంత్, బొత్స కుశాల్, ఎన్టీపీ శ్రీకృష్ణ, ఏ రుష్వాన్, బి భువన్, జెన్ని సుహాస్, ఎన్ వేదశ్, బి మనస్వి, కరణం పార్థవి, ఎం లతీష్, ఏ సహస్ర, మల్లారెడ్డి త్రిలోచన్, నిమ్మక ప్రసన్నకుమార్, ఎం సాథిక్, పూర్విక్ హాషన్, కల్లేపల్లి నీలాం మాన్విత్, వాడిపల్లి శాంతిస్వరూప్, వి ప్రవళ్లిక, సీహెచ్ జోష్విక్, వేదశ్రీ, ఎం తన్విశ్రీ విజేతలగా నిలిచారు.

Related posts

అమరావతికి ఫస్ట్ ఇంటర్నేషనల్ వర్సిటీ

Satyam News

రౌడీ పెరేడ్ చేయించిన నెల్లూరు పోలీసులు

Satyam News

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో అట్టుడుకుతున్న గల్ఫ్

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి

Satyam News

Leave a Comment