ప్రత్యేకంహోమ్

“క్వార్టర్” బడ్జెట్ తో వైసీపీ సోషల్ మీడియా విన్యాసాలు!

నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ముత్తుకూరు పరిసరాల్లో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌ తాజాగా ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేసింది. పేరు: “బెల్టుకు మద్యం తరలింపు – మాకు గిల్ట్ అన్నది లేదు”. ఈ స్క్రిప్ట్, డైరెక్షన్ చూస్తే ఆస్కార్ లెవల్లో ఉంది కానీ, క్లైమాక్స్‌లో అసలు విషయం బయటపడి “తుస్సు”మంది.

ఒక ఫేక్ ప్రచారపు బెల్ట్ షాప్ స్కామ్‌ను సృష్టించడానికి వీరు ఎంచుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం ఒక క్వార్టర్ మద్యం బాటిల్! అవును, ఒక అమాయకపు వృద్ధుడికి ఒక క్వార్టర్ బాటిల్ ఎరగా వేసి, ఆయనతో బాటిళ్లు మోయించి, దాన్ని ‘బెల్టు షాపులకు అక్రమ రవాణా’గా చిత్రీకరించారు.

పాపం, ఆ వృద్ధుడికి తెలియదు తను ఒక “వైకాపా కుట్రలో పావుగా” మారానని.వీడియో వైరల్ కాగానే వైకాపా కార్యకర్తలు పండగ చేసుకున్నారు. కానీ కట్ చేస్తే.. ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. “మా తాతకు మద్యం ఆశ చూపి ఇలాంటి పనులు చేయిస్తారా?” అని నిలదీయడంతో అసలు రంగు బయటపడింది. అంటే, స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మర్చిపోయారన్నమాట!

వైకాపా ఫేక్ ఫ్యాక్టరీ ఐడియాలు – అదిరిపోయే అబద్ధాలు!

మద్యం దుకాణాలు సక్రమంగా నడుస్తుంటే మాకు నిద్ర పట్టదు. కాబట్టి మేమే అక్రమాలు సృష్టించి, మేమే వీడియో తీసి, మేమే తిట్టాలి అని వైసీపీ అనుకున్నట్లు ఉంది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ ఇద్దరు ‘మహానుభావులైన’ డైరెక్టర్లు ఇప్పుడు పరారీలో ఉన్నారు. అబద్ధం ఆడాలన్నా ఒక పద్ధతి ఉండాలి.

కక్కుర్తి క్వార్టర్ ఇచ్చి బెల్ట్ షాపుతో దోచుకుంటున్నారని ప్రచారం చేయడం అంటే.. అది వైకాపా దిగజారుడుతనానికి పరాకాష్ట.ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త! రోడ్డు మీద బూమ్ బూమ్ వైకాపా మీకు “మద్యం బాటిల్” ఇస్తామని ఆశ చూపిస్తే, అది మీ మీద ప్రేమతో కాదు.. మిమ్మల్ని సోషల్ మీడియాలో “బెల్ట్ షాప్ స్మగ్లర్”గా చూపించడానికి కావొచ్చు. వైసీపీ నెక్స్ట్ ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో కనుక్కోండి!

ఇబ్రహీం పట్నం జోగి అండ్ అద్దేపల్లి కల్తీ లిక్కర్ స్కాం బ్రదర్స్ ఇంకా జైల్లోనే ఉన్నారు. అంతలోనే మరో ఇద్దరికి టోకెన్ ఇచ్చేసింది వైకాపా. ఇప్పటికే లిక్కర్ స్కామర్స్, కల్తీ లిక్కర్ స్కామర్స్ తో విజయవాడ నుండి నెల్లూరు వరకు జైళ్లు కిటకిటలాడుతున్నాయి. కొత్తగా లిక్కర్ ఫేక్ బెల్ట్ స్కిట్ స్కామర్స్ ను క్వార్టర్ బాటిల్ తో ప్రొడ్యూస్ చేసి అడ్డంగా బుక్ చేసింది వైకాపా.

Related posts

ముంబైని ముంచేసిన భారీ వర్షం

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

అమరావతి అప్‌డేట్: విజయవాడలో కొత్త స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం

Satyam News

ప్రభుత్వ సేవలకు రేటింగ్స్

Satyam News

Leave a Comment