తూర్పుగోదావరిహోమ్

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

#Kakinada

మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమోగా, దుమ్ములుపేట, తాళ్ళరేవు మండలం గాడిమోగ ఇతర ప్రాంతాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ పట్టణం ఏటిమోగ, తూర్పుపాక ప్రాంతాన్ని పరిశీలించారు.

పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులతో సహకరించి, ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాకినాడ పట్టణంలో పునరావాసక కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్యకళామందిరం ప్రక్కన సిద్ధం చేసిన భోజన పదార్థాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కాకినాడ పట్టణం దుమ్ములుపేటలోని తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పరల్వపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలకు స్వయంగా మధ్యాహ్నం భోజనం వడ్డించారు.

Related posts

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

Satyam News

వేధింపులే యువ డాక్టర్ ఆత్మహత్య కు కారణం

Satyam News

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన ట్రంప్

Satyam News

ఇరాన్ ఇంధన ప్లాంట్ లపై దాడి 5 రోజులు వాయిదా

Satyam News

ఒంటిమిట్టలో తెలుగుదేశం ఘన విజయం

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

Leave a Comment