ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా సంక్రాంతి పండుగ కళే లేదని, పల్లెలు బోసి పోయి ఉన్నాయని వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పల్లెల్లో పండుగ కళ ఉట్టిపడుతున్నా వారు చేస్తున్న ప్రచారం చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు కూడా. వైసీపీ ఇలా ప్రచారం చేస్తున్నదేమిటని ప్రశ్నిస్తున్నారు.
ఒక వైపు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తాము సంక్రాంతి పండుగ ఉత్సాహంగా జరుపుకున్నట్లు ప్రచారం చేసుకుంటుంటే అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో ఇలాంటి ప్రచారం చేయడమేమిటని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రాజేష్ అప్పసాని తనదైన శైలిలో తన ఫేస్ బుక్ పేజిలో ఒక వ్యాఖ్యానం రాశారు.
2024 (ఎన్నికలకు ముందు) సంక్రాంతి ఎలా జరిగింది? ఇప్పుడు 2026 సంక్రాంతి ఎలా జరుగుతున్నది అని ఆయన విశ్లేషించారు. దీనికి విశేషంగా స్పందన వస్తున్నది. ఈ నేపథ్యంలో సత్యంన్యూస్ పాఠకులకు దాన్ని యధాతధంగా అందిస్తున్నాము….
సంక్రాంతి సందేశం జగన్ రెడ్డి కి చేర్చుదాము..
2024 సంక్రాంతి నాటికి రాష్ట్రం మొత్తం జగన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయం గుప్పెట్లో వణికి పోతున్నారు.. అతగాడు పొలం పాస్ బుక్ మీద తన ఫోటో పొలం హద్దు రాయి మీద తన బొమ్మ ఆఖరికి శాశ్వతంగా వుండే ప్రభుత్వ సర్వే రిజిస్టర్ మీద కూడా తన బొమ్మ వేసుకుని ఆ భయం అనే అగ్నికి ఇంకా ఇంకా ఆజ్యం పోశాడు.. ఇంకో వైపు చూస్తే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రధాన రైతు వారీ కుటుంబాలలో బెటర్ కెరీర్ బెటర్ prospects అంటూ యువత మొత్తం చదువుకుని వలస బాట పట్టి ఉండడం..
గ్రామాల్లో భూ యజమానులుగా మిగిలిన పెద్దలు వృధాప్యం అనారోగ్యం ఒంటరితనం తో ఈ జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు చూస్తూ తీవ్ర మానసిక ఆందోళనలో ఉండటం ఒక్క సారి గుర్తు చేసుకుందాము.. వారి ఆందోళన చూస్తూ గ్రామాల్లో తమకు వున్న ఆస్తిపాస్తులు ప్రమాదంలో పడుతున్న తీరు చూసిన వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో వున్న వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు..
అటువంటి పరిస్థితుల్లోనే నాటి సంక్రాంతికి గ్రామాలకు వచ్చిన కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడి పరిస్థితి కళ్ళతో చూసిన నేపథ్యంలో వారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే ఈ జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడం అని..
కాబట్టే 2024 ఎన్నికలను ఎక్కడ ఎక్కడో వున్న ప్రతి ఒక్కరూ అంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి భూమిక సిద్ధం అయ్యింది ( ఫైనల్ టచ్) మాత్రం 2024 సంక్రాంతి నుంచే.. ఆ ఎన్నికలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని NDA కూటమి ప్రభుత్వం తాము పదవీ బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి సమాజానికి పట్టిన రావణాసుర వధ చేసి ఆనందకర దీపావళి జరుపుకునే అవకాశం సమాజానికి దక్కించారు.. అలాగే జగన్ రెడ్డి బొమ్మ చెక్కించిన సరిహద్దు రాళ్ళు కూడా రద్దు చేసి 2025 సంక్రాంతి నాటికి అసలు సిసలు సంక్రాంతిని పరిచయం చేశారు అలాగే జగన్ రెడ్డి బొమ్మ వున్న పట్టాదారు పాస్ బుక్ ల స్థానంలో ప్రభుత్వ రాజముద్ర తో కూడిన పాస్ బుక్ లు పంపిణీ చేసి 2026 సంక్రాంతికి మరింత వన్నె తెచ్చింది ప్రభుత్వం..
వాస్తవ పరిస్థితి ఇది అయితే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు,రోజా,బొత్స సత్యనారాయణ గార్లు దేవినేని అవినాష్ వంటి వారు వారి వారి ఇళ్లల్లో భోగి మంటలు వేసుకుని పండగ చేసుకున్నారు కానీ మనస్సాక్షి లేని “సాక్షి” మాత్రం రాష్ట్రంలో ప్రజలు అసలు సంక్రాంతి జరుపుకునే మూడ్ లో లేరు చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల ఆయన పాలన పట్ల విపరీతమైన కోపంతో వున్నారు అని కథనాలు రాస్తుంది..
అయ్యా జగన్ రెడ్డి అమ్మా భారతి మీరు మీ పాంప్లేట్ లో ఏ కథలు రాయించినా దాన్ని మీ నాయకులే హేళన చేస్తూ వాళ్ళే బ్రహ్మాండంగా పండగ డాన్సులు చేస్తున్నారు ఇక ప్రజలు మీ రాతలు పట్టించుకున్నారా?
మీరే ఆలోచించుకోండి..
రాజేష్ అప్పసాని
