హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైక్లాథాన్‌ను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైజింగ్ తెలంగాణ” నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలనే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైక్లాథాన్‌లో దాదాపు 200 మంది గ్రూప్-1 శిక్షణ అధికారులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ హితం కోరుతూ సైకిల్ తొక్కారు.

ఈ కార్యక్రమంలో MCHRD డైరెక్టర్ శాంతికుమారి, GHMC కమిషనర్ కర్ణన్, కోర్సు డైరెక్టర్ అరుణ్ కుమార్ IAS, MCHRD ఫ్యాకల్టీ DT చారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు మరికల్ మండల ఎంపీడీవో పృథీరాజ్, విక్రం, శివశంకర్ మరియు ఆఫీసర్స్ కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related posts

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News

గోదావరి వరదతో మునిగిపోతున్న కోనసీమ లంక గ్రామాలు

Satyam News

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి

Satyam News

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News

ఫ్రాడ్ కేసులో చిక్కిన బాలివుడ్ నటులు

Satyam News

Leave a Comment