మహబూబ్ నగర్హోమ్

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

#GadwalCourts

గద్వాల జిల్లా కోర్టు సముదాయం జిల్లా కేంద్రంలోనే నిర్మించాలని జిల్లా న్యాయవాదులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రం లోని కోర్టు ప్రాంగణంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పుల్లయ్య ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గు చేటు అని అన్నారు.

ప్రజలకు అనువైన ప్రాంతం జిల్లా కేంద్రంలోని బిజెపి క్యాంపు కార్యాలయం. అక్కడ నిర్మించకుండా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలలో కోర్టు నిర్మిస్తే, వచ్చే కక్షిదారులకు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది.

అక్కడ ప్రజలు జిల్లా కేంద్రం వచ్చి జిల్లా కేంద్రం నుంచి మళ్లీ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కోర్టు కు వచ్చే కక్షిదారులు గాని సాక్ష్యం చెప్పడానికి వచ్చే వారికీ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది అని అన్నారు.

2024 లో డిసెంబర్లో న్యాయవాదులు నిరసన దీక్ష చేసే సమయంలో అధికార పార్టీ నాయకులు కోర్టు ను గద్వాల జిల్లా కేంద్రంలోని నిర్మించే విధంగా కృషి చేస్తామని చెప్పి నిరసనను విరమించిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఎవరి స్వలాభం కోసం అనంతపురం గుట్టల్లో కోర్టు ను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కచ్చితంగా దీన్ని విరమించుకోవాలి లేని పక్షంలో ప్రజా పోరాటాలు కచ్చితంగా రోడ్ల మీదకు వస్తాయి. ప్రజాలకు వ్యతిరేకంగా పోయేటువంటి ప్రభుత్వం ను, నాయకులను నడిగడ్డ ప్రాంత ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, టిఫిఏఫ్ నాయకులు శంకర ప్రభాకర్, పాలమూరు అధ్యయన వేదిక ఇక్బాల్ బాషా, అబ్దుల్ బాబు సార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

Satyam News

BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

Satyam News

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

Leave a Comment