కృష్ణహోమ్

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని నూత‌న క‌మిష‌న్‌కు మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సూర్య‌కుమారి సూచించారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాలల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల‌కు క‌మిష‌న్ కార్యాల‌యంలో మార్గ‌ద‌ర్శ‌క శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని సోమ‌వారం ఉద‌యం ఆమె ప్రారంభించి మాట్లాడారు.

చైర్ ప‌ర్స‌న్ వేటుకూరి ఏవీఎస్ సూర్య‌నారాయ‌ణ‌రాజు, స‌భ్యులు ఉండ‌వ‌ల్లి గాంధీబాబు, ఎం గంగ సూర్య‌నారాయ‌ణ‌, డా. దోని శ్రీనివాస‌మూర్తి, డా. పి నాగ‌మాన‌స‌, కె.జి ప‌ద్మ‌ల‌త‌, చ‌ల్ల మ‌ధుసూద‌న‌రావుల‌ను ప‌రిచ‌యం చేసుకున్నారు. బాల‌ల విద్య‌, ఆరోగ్యం, వికాసం, హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేద్దామ‌ని పిలుపునిచ్చారు.

డేవిడ్ రాజు సీసీవైజె న‌ల్స‌ర్ యూనివ‌ర్సిటీ, ఆంటోని సెబాస్టియ‌న్ క‌ర్ణాట‌క బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ మాజీ చైర్ ప‌ర్స‌న్ ఈ మార్గ‌ద‌ర్శ‌క శిక్ష‌ణ అందించారు. క‌మిష‌న్ విధి విధానాలు, చ‌ట్టాలు, బాధ్య‌త‌లను వివ‌రించారు. ఈ శిక్ష‌ణ ఏర్పాట్ల‌ను ఏపీఎస్సీపీసీఆర్ సెక్ర‌ట‌రీ జి ఉమాదేవి, కార్యాల‌య సిబ్బంది ప‌ర్య‌వేక్షించారు.

Related posts

నటి సంచితా ఉగాలే ఆత్మహత్య

Satyam News

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

పోలీసులు నిలబెట్టిన కాపురం

Satyam News

ఇంద్రకీలాద్రిపై  సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధం

Satyam News

Leave a Comment