మహబూబ్ నగర్హోమ్

వనపర్తి తాగునీటి సంక్షోభంపై కలెక్టర్ కు ఫిర్యాదు

#DrinkingWater

వనపర్తి పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సంక్షోభంపై బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ యాదవ్ వనపర్తి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రామన్ పాడు పథకం నిర్వీర్యం కావడం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్, వెంటనే చర్యలు తీసుకుని 3 రోజుల్లో నివేదిక (ATR) Action Taken Report సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. గౌరీదేవిపల్లి దగ్గర కరెంటు కోతతో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రామన్ పాడు నుండి రెండు పైప్ లైన్లు ఉన్నా మెయింటెనెన్స్ చేయకపోవడం, మోటార్లు రిపేర్ చేయకపోవడంతో వనపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వనపర్తి కలెక్టర్ కి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు – తేదీ 19-10-2026. దీని మీద కలెక్టర్  “Plz take action immediately and submit ATR within 3 days” అని రాసి M.C కి మార్క్ చేశారు.

ఫిర్యాదు చేసింది: Gnaneshwar Yadav, Vice President, BJP Kisan Morcha, Vallabha Nagar, Wanaparthy.

ఎవరిపై ఫిర్యాదు: మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ DE, AE, మున్సిపల్ ఆఫీస్ అధికారులు.

  1. రామన్ పాడు తాగునీటి సరఫరా:

వనపర్తి పట్టణానికి తాగునీరు ఇచ్చే రామన్ పాడు మంచినీటి పథకం నాశనం అయింది. రామన్ పాడు నుండి నీటిని ఎత్తే మోటర్లు దగ్గరకు తరలించి అక్కడ ఫిల్టర్ చేసి కానాయామిల్లి (కొత్తకోట) సంపు నుండి వనపర్తికి నీరు తరలించే సిస్టం ఫెయిల్ అయింది.

  1. మెయింటెనెన్స్ లేదు:

రెండు పైప్ లైన్ల మెయింటెనెన్స్ చేయడం లేదు. శాశ్వత మంచినీటి స్కీం రామన్ పాడు పైప్ లైన్లు పాడై ఉన్నా పట్టించుకోవడం లేదు.రామన్ పాడు రిజర్వాయర్ లో ,బుగ్గపల్లి మిషన్ భగీరథ, రెండు స్థానాల్లో నీరు పుష్కలంగా ఉంది. రెండు పైప్ లైన్లు పని చేస్తే వనపర్తికి సమస్యే ఉండదు.

  1. గౌరీదేవిపల్లి దగ్గర, బుగ్గపల్లి తండా దగ్గర కరెంటు కోత:

గౌరీదేవిపల్లి దగ్గర, బుగ్గపల్లి తండా దగ్గర ఉన్న పంప్ హౌస్ లకు కరెంటు సరిగా రావడం లేదు. దీనివల్ల నీరు రావడం లేదు.

  1. ప్రజలు అల్లాడుతున్నారు:

కరెంటు లేక, మోటార్లు రిపేర్ చేయక, వనపర్తిలో తాగునీటి ఎద్దడి ముదిరింది. 4 రోజులకు ఒకసారి కూడా నీరు ఇవ్వలేకపోతున్నారు.మునిసిపల్ చైర్మన్ వార్డు 33వ వార్డులో గౌతమ్ మాడల్ స్కూల్ లైన్ లో మోటార్లు, ఇప్పుడు  4రోజులకు ఒకసారి నీరు వదులుతున్నారు.

  1. డిమాండ్:

నిర్లక్ష్యంగా ఉన్న వనపర్తి కమిషనర్, వనపర్తి మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులపై చర్య తీసుకోవాలి. రామన్ పాడు నుండి వనపర్తికి ఉన్న రెండు లైన్ల ద్వారా నీటి సరఫరా చేయాలి. మోటార్లు రిపేర్, పైప్ లైన్, వాల్వ్ రిపేర్ చేయాలి. రామన్ పాడు రిజర్వాయర్ ను, ఎర్రగట్టు, కానాయపల్లి ప్రాంతాలకు అధికారులను పంపాలని జ్ఞానేశ్వర్ యాదవ్ కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి

Satyam News

కేంద్ర ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

Satyam News

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసన

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

Leave a Comment