సంపాదకీయంహోమ్

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

#Rachamallusivaprasadareddy

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దారుణంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యఖ్యలు ప్రజాస్వామ్యానికి పెను ముప్పుఅని, ఆయనను  తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.

మొన్న బాహాటంగా ఓటర్లకు డబ్బులు పంచకపోతే దసరా పండగకు జనానికి దిక్కులేదన్నట్లుగా మాట్లాడాడు. ఈసీ మౌనంగా చూసిందే కాని స్పందించలేదు. తాజాగా ఎన్నికల వేళ రాజకీయ నాయకులు సంయమనం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రజలను, అధికారులను బెదిరించడం హేయమైన చర్య. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన తీవ్ర హెచ్చరికలు, ప్రత్యర్థులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని అంటున్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, తమ ఆస్తులను, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధమని, అవసరమైతే రక్తపాతం సృష్టిస్తామంటూ బహిరంగంగా హెచ్చరించడం తీవ్ర అభ్యంతరకరం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పోలీసులు, చట్టం తమను ఏమీ చేయలేవన్నట్లుగా, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయి. అల్లర్లకు ఆజ్యం పోసే ఇలాంటి నేతలను ఉపేక్షిస్తే సమాజంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తాయి.

మాజీ ఎమ్మెల్యేనన్న అహంకారంతో పోలీసులను, ప్రత్యర్థులను బెదిరించే వారికి చట్టం యొక్క రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, హింసను ప్రేరేపించే రీతిలో మాట్లాడుతున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని మరియు పోలీసు యంత్రాంగాన్ని జనం డిమాండ్ చేస్తున్నారు.

Related posts

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

ప్రధాని మోడీ రోడ్ షోతో దద్దరిల్లిన వారణాసి

Satyam News

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

Satyam News

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఆర్మీ అధికారి కాల్చివేత

Satyam News

Leave a Comment