గుంటూరుహోమ్

మంగళగిరిలో రౌడీ షీటర్ అరెస్టు

#Mangalagiri

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అరెస్టులు చేయడంతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

పెదవడ్లపూడి గ్రామంలో నమోదైన కొట్లాట కేసులో నిందితుడిని  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ అనంతరం నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించబడింది. నిందితుడు బత్తుల సందీప్ బాబు అలియాస్ శాండీ (20), పెదవడ్లపూడి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. విచారణలో ఇతను గ్రామానికి చెందిన గంజాయి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో నిందితుడైన శశి అనే వ్యక్తితో కలిసి తిరుగుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడైందని ఎస్సై వెంకట్ తెలిపారు.

నిందితుడిపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు, తాజాగా కొట్లాట ఘటన నేపథ్యంలో అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అదేవిధంగా నిందితుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్లు నమోదు చేసి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.

Related posts

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News

హీట్ వేవ్ యాక్ష‌న్ ప్లాన్‌: అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు

Satyam News

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

Satyam News

యుద్ధం నేపథ్యంలో TGWWC ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం

Satyam News

అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

Satyam News

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

Leave a Comment