గుంటూరుహోమ్

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

#crime

చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు గా సేవలందిస్తున్న గురవమ్మకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా, రూ. 9 లక్షలు ఫిర్యాదుకి చెల్లించేలా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆవుల సలోమి మంగళవారం తీర్పు వెలువరించారు.

గురవమ్మ 2019 సెప్టెంబర్ 14 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన ప్రతిపాటి రక్షణ లత వద్ద రూ ఆరు లక్షలు అప్పుగా తీసుకున్నారు . ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా 2021 నవంబర్ 8న రూ. 9 లక్షలకు గురవమ్మ రక్షణ లత కు చెక్కు ఇచ్చారు.

సదరు చెక్కును రక్షణ లత తన బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారు. అది చెల్లలేదు, ఈ మేరకు ఆమె కోర్టులో కేసు దాఖలు చేసుకున్నారు. విచారణలో నేరం రుజువు అవడంతో కోర్టు తీర్పు వెలువబడింది.

Related posts

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

అమ్మా…. నాకు ఆ అబ్బాయి కావాలి!

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

Leave a Comment