మెదక్హోమ్

కాంగ్రెస్ సర్కార్  మరో భారీ భూ కుంభకోణం

#HarishRaoBRS

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో సుమారు రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ తెలంగాణ ఆయిల్‌ఫెడ్  భూమిని  ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖలోని ముఖ్యంశాలు..

కాంగ్రెస్ ప్రభుత్వం నగరం నడిబొడ్డులో మరో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోంది.

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అజామాబాద్‌లో ఉన్న రూ.500 కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్న ప్రభుత్వం.

బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు పలికే భూమిని.. కేవలం 87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర.

ఆ 87 కోట్లు చెల్లించడానికి సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ఫెడ్ సిద్ధంగా ఉన్నా.. వారిని కాదని ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడం వెనుక ఉన్న కుంభకోణం ఏంటి?

మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని లాక్కునే దుర్మార్గం.

1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలో తొక్కారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాం.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠానీల్లా వేల కోట్ల భూముల పందేరం చేస్తున్నారు.

ఒకవైపు సామాన్యుల ఇండ్లను 22A జాబితాలో పెట్టి వేధింపులు.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు దారాదత్తం.

ఇది ఒక్క అజామాబాద్ భూమి కథే కాదు.. కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందానే నడుస్తోంది.

ఇలా స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే.. భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి స్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదు.

తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలి.

ప్రజల సొత్తును ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మహా పోరాటం చేస్తాం.

Related posts

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Satyam News

ఉప్పలపాడులో 12న 18 దేవతా విగ్రహమూర్తుల ప్రతిష్ట 

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

గండికోట ఉత్సవాలలో ఏ రోజు ఏం జరుగుతుంది….?

Satyam News

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Satyam News

Leave a Comment