చిత్తూరుహోమ్

మా జీవితాలతో ఆడుకోవద్దు జగన్

#StudentsProtest

తిరుపతిలో నిరుద్యోగ విద్యార్థి, యువత సంయుక్తంగా తానికొండ రంజిత్ నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రాకపట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ ఎంఆర్ పల్లి వద్ద ప్లకార్డులతో  తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా రంజిత్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనలోని ఐదు సంవత్సరాలు తీవ్ర దోపిడీకి, అన్యాయాలకు, దురాగతాలకు చోటు దొరకడంతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి భారీగా దెబ్బతీసిందని తద్వారా నిరుద్యోగం భారీగా పెరిగింది అన్నారు.

మరల ప్రజల ఆమోదంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ తో దోపిడి ధరాగతాలు తగ్గి మరల రాష్ట్రం గాడిన పడి  ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి చొరవతో అనేక ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు నందు పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాటిని అడ్డుకునేందుకు హైకోర్టులో కేసులు వేయడం చాలా దారుణమని ఆయన అన్నారు.

వచ్చేటువంటి పరిశ్రమలు ఐటీ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతుందని అయితే వైఎస్ఆర్సిపి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో పరిశ్రమల రాకను హైకోర్టులో అడ్డుకోవడం అనేది కచ్చితంగా నిరుద్యోగ యువత, విద్యార్థి పొట్ట కొట్టడమేనని తీవ్రంగా ఆక్షేపించారు. దీనికి వైఎస్ఆర్సిపి  ప్రజల నుంచి కచ్చితంగా పర్యావసనాలు మరియు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటుందని, నిరుద్యోగులం అయిన మేము  ఖచ్చితంగా మరల బుద్ధి చెబుతామని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కుసుమ, మధు, నాగార్జున, హర్ష, పవన్ రాయల్, భరత్ మరియు భారీగా నిరుద్యోగ యువత విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ ఖాయం?

Satyam News

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News

శ్రీరామ నవమి నాడు అయోధ్యలో కనిపించిన అద్భుతం

Satyam News

శ్రీ పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ ఘనంగా నిర్వహణ

Satyam News

ఆర్డీటీ చిక్కుముడి విప్పిన లోకేష్!

Satyam News

యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ.. తాడేపల్లి ప్యాలెస్!

Satyam News

Leave a Comment