మహబూబ్ నగర్హోమ్

భక్తిశ్రద్ధలతో సత్యసాయి విద్యానికేతన్ బోనాల వేడుకలు

#SaiVidyaNiketan

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సత్యసాయి విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా సాగాయి.

సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకున్న విద్యార్థినులు తలపై బోనాలు మోసుకుంటూ, విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పట్టణంలోని పలు వార్డుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తి గీతాలు, జైజైధ్వానాలతో ఊరేగింపు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మార్గమధ్యంలో ప్రజలు విద్యార్థులను అభినందిస్తూ  స్వాగతం పలికారు.

శోభాయాత్ర స్థానిక గ్రామదేవత సకల సుంకులమ్మ అమ్మవారి దేవాలయం వరకు చేరుకోగా, అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, పట్టణ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భారతీయ ఆధ్యాత్మిక విలువలను అలవర్చే లక్ష్యంతో ప్రతి ఏడాది బోనాల వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి–విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొని బోనాల వేడుకలను భక్తిపూర్వకంగా నిర్వహించారు. సత్యసాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బోనాల శోభాయాత్ర గద్వాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

Related posts

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

భారత్ రక్షణ రంగంలో మరో కీలక అడుగు

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

తంబళ్లపల్లెలో ‘ ప్రక్షాళన’ పండగ!

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

అమరావతి బిల్లుకు తెలంగాణ మంత్రి హర్షం

Satyam News

Leave a Comment