32.2 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఫేస్ బుక్, వాట్స్ యాప్ లకు ‘సుప్రీం’ అక్షింతలు

#FaceBook

డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కుతో ఆటలాడుకోవద్దని సుప్రీంకోర్టు మంగళవారం మెటా ప్లాట్‌ఫార్మ్స్ ఇన్‌క్, వాట్సాప్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విధించిన రూ.213.14 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్స్‌ను విచారించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి‌లతో కూడిన ధర్మాసనం, ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. అలాగే ఈ కేసులో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY)ను కూడా పార్టీగా చేర్చాలని ఆదేశించింది. మెటా, వాట్సాప్‌లు దాఖలు చేసిన అప్పీల్స్‌పై విచారణ జరిపిన కోర్టు, మార్కెట్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేశారన్న CCI నిర్ధారణలను సమర్థించిన NCLAT తీర్పును పరిశీలించింది.

అయితే ప్రకటనల కోసం డేటా షేరింగ్ విషయంలో కొంత పరిమిత ఉపశమనం మాత్రమే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ తీవ్రంగా స్పందిస్తూ, “డేటా షేరింగ్ పేరుతో ఈ దేశ పౌరుల గోప్యత హక్కును మీరు ఉల్లంఘించ లేరు. ఒక్క పదమైనా డేటాను షేర్ చేయడానికి మేము అనుమతించం. మీరు హామీ ఇవ్వాలి, లేకపోతే మేమే ఉత్తర్వులు జారీ చేస్తాం” అని వ్యాఖ్యానించారు.

భారతదేశంలో గోప్యత హక్కును అత్యంత కఠినంగా కాపాడతామని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవసీ నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థంకాని విధంగా చాలా చాకచక్యంగా రూపొందించారని పేర్కొంది. “ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించే మర్యాదైన మార్గంలా ఉంది. మేము దీన్ని అనుమతించం. మీరు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి, లేకపోతే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది” అని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు.

Related posts

మంత్రులకు వారానికి ఒక రోజు సెలవు

Satyam News

నారాయణ భక్తి మార్గం పై సటైర్లు…

Satyam News

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News

అమిత్ షా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే బహిష్కరిస్తారా?

Satyam News

హిల్ట్ పాలసీ పై ఇచ్చిన జి.ఓ రద్దు చేయాలి

Satyam News

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News

Leave a Comment