హైదరాబాద్హోమ్

కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష

బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద జరుగుతున్న కేబీఆర్ పార్క్ ప్యాకేజ్ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ ఆర్ వి కర్ణన్, చీఫ్ ఇంజనీర్‌ సహదేవ్ రత్నాకర్ తో కలిసి సోమవారం పరిశీలించారు.

మొత్తం 6 పియర్ ఫౌండేషన్‌ల తవ్వకాలు పూర్తయ్యాయని, అందులో 3 పియర్‌లకు పీసీసీ బెడ్ పనులు పూర్తయ్యాయని అధికారులు కమిషనర్ కు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్‌ల కోసం స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు మంగళవారం ప్రారంభం కానున్నాయి.

ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు సాగుతున్న తీరుపట్ల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు ఎంఈఐఎల్ (మెగా) సంస్థ అదనంగా మెషిన్, మ్యాన్ పవర్ ను సమకూర్చుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

క్షేత్ర తనిఖీలో కమిషనర్ వెంట ఈఈ (ప్రాజెక్ట్స్), డీఈఈ, ఏఈఈ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

కూరగాయల సాగు విస్తీర్ణం పెంపునకు కృషి

Satyam News

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

Satyam News

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

Satyam News

ప్రపంచ కప్ మూడో సారి భారత్ కైవసం

Satyam News

Leave a Comment