ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

#crime

ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి గతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరూ కలిసి ఒక ఓయో హోటల్ గదికి వెళ్లారు.

ఆ సమయంలో సదరు మహిళ అధికారికి తెలియకుండా వారిద్దరి ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్‌లో రికార్డు చేసింది. ఆ వీడియోలను ఆసరాగా చేసుకుని సదరు మహిళ డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టింది. అలా గత మూడేళ్లుగా ఆమె సదరు అధికారి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది.

ఇక భరించలేకపోయిన ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారి చివరకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న మహిళపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలైన మహిళపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు

Related posts

సీఎం ప్రజావాణి లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెంచులు

Satyam News

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

Satyam News

కొత్తగా 4 లక్షల ఇళ్లు…. ఏపీలో పేదలకు మరో వరం

Satyam News

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

Satyam News

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వైభవంగా ఆర్జిత సేవలు

Satyam News

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News

Leave a Comment