కృష్ణహోమ్

ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్గాటించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి నాయకత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభివృద్ధి పనుల సమీక్ష నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు రోజంతా బిజీగా గడిపారు. ఉదయం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో నేషనల్ హైవే డీఈ సత్యనారాయణ, ఏఈ శరత్ చంద్రలతో రైల్వే గేట్లపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే, వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గుడ్ మెన్ పేట పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. గుడివాడ రైల్వే గేట్ల వద్ద దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే ఈ ఫ్లైఓవర్ పనులు నిర్దేశించిన గడువులోపు చెయ్యాలని అధికారులకు స్పష్టం చేశారు.

అనంతరం నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాలకు చెందిన పలువురు బాధితులు సీఎంఆర్ఎఫ్ అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. వాటిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే ఆన్‌లైన్ ప్రక్రియ చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు.

బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం తప్పకుండా అందుతుందనీ,అర్జీల నుంచి ఆమోదం వరకు మిగిలిన ప్రక్రియ మేమే స్వయంగా చూసుకుంటామన్నారు.దీనికోసం ప్రజా వేదికలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ కోసం బాధితులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ప్రజా వేదికలోనే పూర్తి ప్రక్రియ చేయించడం కూటమి ప్రభుత్వం చెబుతున్న పారదర్శక పాలనకు ఆచరణ రూపంగా నిలుస్తోందనీ భరోసా ఇచ్చారు.

గుడివాడ మార్కెట్ సెంటర్‌లో ఆక్రమణలు తొలగించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని, తమకు సహాయం చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా, ప్రజలకు ఇబ్బంది కలిగే చోట మాత్రమే ఆక్రమణలు తొలగిస్తామని,ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదనీ స్పష్టం చేశారు.ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎవరికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామాల వారీగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ఇతర రోజుల్లో గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో మేమంతా పని చేస్తున్నాం అని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జిల్లా నాయకులు పాలంకి సారథి, గుడివాడ రూరల్, నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పట్టణ అధ్యక్షులు పండ్రాజ్ సాంబయ్య,గుడివాడ జనసేన అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, బిజెపి జిల్లా నాయకులు సురే లక్ష్మీనారాయణ గాంధీ, అంగడాల సతీష్,జనసేన నాయకులు సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, మాజీ కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు తదితరులు పలు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే రామును కలిశారు.

Related posts

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News

గాయకుడు గా మారిన దర్శకుడు పీసీ ఆదిత్య

Satyam News

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

Satyam News

భారీ వరద కూడా తట్టుకుని నిలబడ్డ పోచారం

Satyam News

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Satyam News

విమానం కూలి అజిత్ పవర్ మృతి

Satyam News

Leave a Comment