సినిమాహోమ్

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

సినీ రంగం లో నిత్య ప్రయోగశీలి, ప్రకృతి ప్రేమికుడు డా. పీసీ ఆదిత్య కు ప్రతిష్టత్మాక పర్యావరణ రక్షణ పురస్కారం లభించింది. సినీ దర్శకుడిగా ఆదిత్య తన 30 సంవత్సరాల ప్రయాణం లో అధిక చలన చిత్రాలు, లఘు చిత్రాలు సహజ ప్రకృతి అందాల మధ్య, పర్యావరణ పరిరక్షణ కు ప్రాధాన్యత నిస్తూ, దాదాపు ప్రతీ చిత్రం లో సందేశం ఇస్తూనే ఉన్నారు.

ఆదిత్య తన చిత్రాల షూటింగ్స్ అధిక శాతం అవుట్ డోర్ లో తీయడానికే ఇష్ట పడతారు. తెర పై పచ్చ దనాన్ని చూపించడానికే ఆలోచిస్తారు. ఇవన్నీ గుర్తించిన కోహినూర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు జూన్ 5 వ తేది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా EXCELLENCE ENVIRONMENT PROTECTOR AWARD. 2026 ని అందజేశారు. సంస్థ అధినేత్రి దాసరి స్వప్న మహేష్ వివరిస్తూ పర్యావరణ ప్రేమికుడు, సీనియర్ దర్శకులు డా. పీసీ ఆదిత్య వంటి లెజెండ్ ని ఈ అవార్డు తో సత్కారించడం గర్వం గా ఉందన్నారు.

అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ పచ్చని పల్లెటూరు నుండి భాగ్యనగర్ కి వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డా, ప్రకృతి అన్నా, పర్యావరణమ్ అన్నా ఎంతో ప్రేమిస్తానని తన ప్రతీ చిత్రం లో ప్రకృతి గురించి సందేశం ఇస్తున్నానని.. భవిష్యత్ లో కూడా తన వంతు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదిత్య కు అభిమానులు, మిత్రులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియ జేశారు.

Related posts

శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం

Satyam News

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News

తప్పుకున్న పాకిస్తాన్ : వాట్ నెక్ట్స్ ?

Satyam News

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

Satyam News

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

వైద్యులు నిర్లక్ష్యం మలేరియాతో యువకుడు మృతి

Satyam News

Leave a Comment