గుంటూరుహోమ్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి 109 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ కృత్తిక శుక్లా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు.

జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

New Record: దేవాదాయ శాఖలో 191 మందికి నియామక ఉత్తర్వులు

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

గుంటూరులో ఉగ్ర లింకుల కలకలం

Satyam News

బి.ఆర్.నాయుడుపై డీప్ ఫేక్ కుట్ర: మదనపల్లిలో కేసు నమోదు

Satyam News

అంతర్జాతీయ చమురు సరఫరాకు మళ్లీ ముప్పు?

Satyam News

త్వరలో రష్యా లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Satyam News

Leave a Comment