పశ్చిమగోదావరిహోమ్

బాల్య వివాహాలను నిరోధించడం మన బాధ్యత

#ChildMarriage

బాల్య వివాహాలను నిరోధించే చట్టాలను పటిష్టంగా అమలు పరిచే విధంగా చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్, చైల్డ్ మ్యారేజ్ నిరోధక వ్యవస్థ సంయుక్తంగా దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని బాల్య వివాహాలు నిరోధక వ్యవస్థాపకులు ఆర్. వినోద్ కుమార్ తెలిపారు.

దేశంలో బాల్య వివాహాలను అరికట్టి చైల్డ్ రైట్స్ ను పరిరక్షించి బాల్య వివాహ విముక్త భారత్ ను నిర్మించాలన్నదే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఏలూరు జిల్లా దుగ్గిరాల సెయింట్ డి పాల్  జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న 100 రోజుల క్యాంపెయిన్ లో భాగంగా NCC విద్యార్థిని, విద్యార్థులతో కలసి భారీ ర్యాలీని నిర్వహించారు.

వారందరితో బాల్య వివాహాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ మ్యారేజ్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్.వినోద్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే. బాల్య వివాహం చట్టరీత్యా నేరం అని అన్నారు.

చైల్డ్ హెల్ప్ లైన్ సభ్యులు వై.వెంకట రాజు మాట్లాడుతూ బాల్య వివాహ నష్టాలపై , విద్యార్థిని,  విద్యార్థులకు పూర్తి అవగాహనను కల్పించడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా బాల్య వివాహం కి సంబంధించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ 112 కి సమాచారం అందించాలని సూచించాలన్నారు.

ఈ ప్రతిజ్ఞలొ కళాశాల సిబ్బంది మరియు NCC విద్యార్థిని విద్యార్థులు మరియు చైల్డ్ హెల్ప్ లైన్ వై. వెంకట రాజు , డి.సి.పి.యు ఎస్. సునీత క్రాఫ్ట్ సి.ఎస్. డబ్ల్యు జి. రాజలక్ష్మి పాల్గొన్నారు.

Related posts

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News

BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News

రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..?

Satyam News

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌

Satyam News

Leave a Comment