ప్రత్యేకంహోమ్

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం!

#DKShivkumar

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని, దేశంలోనే ఈ విధానాన్ని ఫస్ట్‌ టైం చంద్రబాబు సక్సెస్‌ చేశారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కొనియాడారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో అమరావతిని నానారకాలుగా విమర్శించిన వైసీపీ అధినేత జగన్‌కు ఈ వ్యాఖ్యలు గట్టి కౌంటర్‌లా నిలిచాయి. కొత్త నగరాల నిర్మాణం ఎంత సవాల్‌తో కూడుకున్నదో చెబుతూనే.. ఏ విషయంలోనైనా బెంచ్‌మార్క్‌ సెట్ చేసేలా చంద్రబాబు పనిచేస్తారంటూ డీకే ప్రశంసించారు.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో విస్టా స్పేసెస్‌ సంస్థ నిర్మించిన  ద ఎర్త్‌ సెంటర్‌ భవన ప్రారంభోత్సవంలో చంద్రబాబుతో కలిసి డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోనూ అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తామని ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కొత్త రాజధాని నిర్మాణం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ఆయన మెచ్చుకున్నారు. పక్క రాష్ట్రాల నేతలే అమరావతి అభివృద్ధినీ, బాబు విజన్‌నూ ఇంతలా పొగడుతుంటే.. ఇప్పటికైనా వైసీపీ నేతలు కళ్లు తెరవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

గతంలో జగన్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అమరావతిని పక్కనపెట్టి, మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తును డైలమాలో పడేసిందనే విమర్శలున్నాయి. కానీ, నేడు పక్క రాష్ట్రాల లీడర్లు సైతం అమరావతి గొప్పతనాన్ని మెచ్చుకుంటుండటంతో.. జగన్ చేసిన తప్పులు, ఆయన సంకుచిత రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. అమరావతిని కేవలం ఒక సిటీలా కాకుండా, భవిష్యత్ తరాల కోసం అదిరిపోయే ఎకోసిస్టమ్‌తో గ్రీన్ సిటీలా తీర్చిదిద్దుతున్నామని ఈ వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు.

డీకే శివకుమార్ చేసిన ఈ కామెంట్స్‌తోనైనా అమరావతిపై వైసీపీ వేస్తున్న తప్పుడు అడుగులకు బ్రేక్ పడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు, పార్టీలకంటే విజనరీ లీడర్‌షిప్ ఎంత ముఖ్యమో డీకే మాటలు మరోసారి రుజువు చేశాయి. రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు వేస్తున్న ప్రతీ అడుగు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుండటం తెలుగు ప్రజలకు ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి.

Related posts

లిక్కర్ స్కామ్‌: ప్రైవేట్ జెట్లు….. జల్సాలు…. ఆఫ్రికాలో పెట్టుబడులు!

Satyam News

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

Satyam News

ఆదాయ సమీకరణపై సీఎం రేవంత్ మార్గదర్శకాలు

Satyam News

ఈ నెల 14 లోగా డిజిటిలైజేష‌న్  ప్ర‌క్రియ‌ను పూర్తి

Satyam News

ఒత్తిడికి లొంగిపోయిన కేంద్ర ఎన్నికల సంఘం

Satyam News

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News

Leave a Comment