26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

వార్ రూమ్ లో ఖొమైనీ: వీడియో వైరల్

#Khamenei

ఇరాన్ సుప్రీం నాయకుడిగా భావిస్తున్న మొజతబా ఖొమైనీ మొదటిసారి హైటెక్ వార్ కంట్రోల్ రూమ్ లో ఉన్నట్లు చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎక్స్ సహా పలు వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఈ వీడియోలో, ఖమెనీ ఒక సైనిక ఆపరేషన్స్ సెంటర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. నేపథ్యంలో పెద్ద డిజిటల్ స్క్రీన్‌లు ఉండగా, వాటిలో ఒకదానిపై ఇజ్రాయెల్‌కు చెందిన డైమోనా న్యూక్లియర్ ఫెసిలిటీ వివరాలు కనిపిస్తున్నాయని కొందరు పేర్కొన్నారు.

ఈ విజువల్స్ లో ఉన్నట్లు యుద్ధ పరిస్థితుల్లో ఆయన తొలి ప్రత్యక్ష ప్రదర్శన అంటూ ప్రచారం జరుగుతున్నది. పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, స్వతంత్ర విశ్లేషణలు ఈ వీడియో వాస్తవ రూపంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేశాయి. పరిశీలనల ప్రకారం, ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించినదై ఉండే అవకాశముందని కొందరు అంటున్నారు.

ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా లేదా అంతర్జాతీయంగా విశ్వసనీయ వార్తా సంస్థల నుంచి ఈ వీడియోకు ఎలాంటి ధృవీకరణ రాలేదు.

నిపుణులు ఈ వీడియోలో అసహజమైన లైటింగ్, ముఖ వివరాల్లో స్పష్టత లేకపోవడం, డిజిటల్ లోపాలు వంటి లక్షణాలను గుర్తించారు. ఇవి సాధారణంగా కృత్రిమంగా రూపొందించిన లేదా మార్పులు చేసిన వీడియోల్లో కనిపించే సూచనలుగా చెబుతున్నారు.

2026 ప్రారంభంలో అధికారంలోకి వచ్చారనే ప్రచారం ఉన్నప్పటికీ, మొజ్తబా ఖమెనీ ఇప్పటివరకు ఎలాంటి పబ్లిక్ ప్రదర్శన చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆయన ఆరోగ్యం, స్థితి, నాయకత్వంపై ఇప్పటికే ఊహాగానాలు నెలకొన్నాయి.

అధికారిక సమాచారం లేని పరిస్థితుల్లో ఇలాంటి వైరల్ కంటెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రకమైన వీడియోలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంతో పాటు పరిస్థితులను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పటికీ, దాని నిజానిజాలపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. అందువల్ల ఇది తప్పుదారి పట్టించే లేదా అసత్య సమాచారం కావచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Related posts

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

Satyam News

చంద్రబాబు..  ది టార్చ్‌బేరర్‌.. నాడు మైక్రోసాఫ్ట్‌…నేడు గూగుల్‌!

Satyam News

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News

Leave a Comment