కృష్ణహోమ్

గుడివాడ పోలీసు స్టేషన్ లో జగన్ బంధువు

#ArjunReddy

కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ బంధువు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి విచారణ ముగిసింది. విచారణ అనంతరం అర్జున్‌రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్‌ పీఎస్‌ సీఐ హనీష్‌ మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యవహారంలో 2024లో సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ కేసుకు సంబంధించి ఇటీవల ఆయనకు 41-ఏ నోటీసులు జారీ చేశామని చెప్పారు.

నోటీసుల నేపథ్యంలోనే నేడు అర్జున్‌రెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారణ నిర్వహించినట్లు సీఐ హనీష్‌ వెల్లడించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించామని, అవసరమైతే తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

తిరుమలలో నెయ్యి కల్తీతో లడ్డూ జిహాద్‌..?

Satyam News

దసరా శరన్నవరాత్రి విశేష సేవల ఆన్‌లైన్ టికెట్ల విడుదల

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

Satyam News

అసదుద్దీన్ కు కీలక పదవి ఇచ్చిన బీజేపీ

Satyam News

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి

Satyam News

సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు 20న నిరాహార దీక్ష

Satyam News

Leave a Comment