జాతీయంహోమ్

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా నూతన ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు.

Related posts

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

చాణక్య తాజా సర్వే: ఘోరంగా దెబ్బతిన్న జగన్

Satyam News

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

Satyam News

మనం ఉత్తరాంధ్ర రీజినల్ బ్యూరోకు ఘన సత్కారం

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

Leave a Comment