25.6 C
Hyderabad
September 29, 2026
ప్రత్యేకంహోమ్

బచ్చలికూర జోసఫ్ వ్యాఖ్యల్ని ఖండించిన విశాఖ శారదా పీఠం

సనాతన హిందూ ధర్మం, పురాణాలపై బచ్చలికూర జోసఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను విశాఖ శ్రీ శారదాపీఠం తీవ్రంగా ఖండించింది. పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రత్యేకంగా స్పందించారు.

బచ్చలికూర జోసఫ్ చేసిన అనుచిత వ్యాఖ్యల కు పరిహారం గా రామతారక మంత్రంతో ప్రత్యేక హోమం, జపాలు నిర్వహించి పాప పరిహార ప్రార్థనలు చేశారు. రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు, దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమని స్వామీజీ అన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణలో ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్‌తో పాటు పీఠాలు, మఠాలు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. ధర్మంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.

భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని అవమానించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ధర్మ పరిరక్షణ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు.

Related posts

నిర్ణీత కాల వ్యవధి లో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

ఫారెక్స్ నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన భారత్

Satyam News

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

Leave a Comment