25.7 C
Hyderabad
September 24, 2026
ప్రత్యేకంహోమ్

యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ.. తాడేపల్లి ప్యాలెస్!

#jagan

యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారీకి బ్రాండ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు తాడేపల్లి ప్యాలెస్. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయాలన్నా, వారి గొంతు అణచివేయాలన్నా.. అక్కడి నుంచే పక్కా స్కెచ్‌తో రౌడీ మూకలు రంగంలోకి దిగుతాయనే విమర్శలకు తాజా విజయవాడ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. సోమవారం శాప్ కార్యాలయం దగ్గర ఉపాధ్యాయులపై విరుచుకుపడిన రౌడీషీటర్ల వెనుక ఉన్నది జగన్ ప్యాలెస్సేనని, ఆ మూకలందరికీ ఆయనతో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో సహా బయటపడటం సంచలనంగా మారింది.

ఈ ఉన్మాద కాండపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా కీలక ఆధారాలు బయటపెట్టారు. దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్క రౌడీషీటర్ జగన్‌తో సన్నిహితంగా దిగిన ఫోటోలను, వారు చేసిన వీరంగం తాలూకు వీడియోలను జతచేసి ప్యాలెస్ బండారం బయటపెట్టారు. గుంటూరుకు చెందిన పానుగంటి చైతన్య, బంకా అరుణ్ తో పాటు..ఎస్. సందీప్, అవుతు శ్రీనివాసరెడ్డి, మార్త శ్రీనివాస్, గడ్డెటి సురేంద్ర, అలా రాజ్‌పాల్, చిత్రాల ఒబేదు, వెలుపుల రమేష్, బెజవాడ రాజశేఖర్, బంకా శివ లాంటి పేరుమోసిన రౌడీలు జగన్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. జగన్ రౌడీషీటర్ల పక్షాన నిలబడ్డారు..నేను ఉపాధ్యాయులు, క్రీడాకారుల పక్షాన నిలబడ్డాను. ఎవరి వైపు ఉండాలో మీరే తేల్చుకోండి అంటూ లోకేశ్ సంధించిన అస్త్రం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు బంకా అరుణ్

శాప్ కార్యాలయం వద్ద ఈ రౌడీ మూకలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. గురువులు అనే కనీస ఇంగితం లేకుండా తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ, బూతులు తిడుతూ కర్రలతో రెచ్చిపోయిన బంకా అరుణ్ అనే వ్యక్తి పక్కా క్రిమినల్. మాజీ MLC లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడైన రౌడీషీటర్ పానుగంటి చైతన్యకు ఇతను అత్యంత సన్నిహితుడు. ఏకంగా 18 కేసులున్న కన్నెగంటి అరుణ్‌బాబు కనుసన్నల్లో పనిచేసే ఈ అరుణ్‌పై గతంలోనూ కేసులున్నాయి. ఇలాంటి కరుడుగట్టిన నేరస్థులను ఉపాధ్యాయులపైకి ఉసిగొల్పడం తాడేపల్లి బ్రాండ్ మార్క్ పాలిటిక్స్‌కు నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇంపోర్ట్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై గూండాలతో విధ్వంసం సృష్టించినా, ఏకంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినా..గన్నవరంలో టీడీపీ ఆఫీసును పట్టపగలే తగలబెట్టినా అవన్నీ ఈ బ్రాండ్ ఫ్యాక్టరీలో తయారైన మూకల పనే అన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యం. ఇక అమరావతి రైతుల పాదయాత్రపైనా, ప్రతిపక్ష నాయకుల పర్యటనలపైనా ఇలాంటి బ్యాచ్‌లతోనే దాడులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారం కోల్పోయినా అదే ఉన్మాదం

నాడు అధికార మదంతో ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ఈ మూకలు..నేడు అధికారం కోల్పోయినా అదే ఉన్మాదంతో ఏకంగా గురువులపైనే దాడులకు తెగబడటం చూసి రాష్ట్రం నివ్వెరపోతోంది. నేరస్థులను పెంచి పోషించి, వారిని రాజకీయ పావులుగా వాడుకునే తాడేపల్లి ప్యాలెస్ కుట్రలని, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ పనిపట్టాల్సిందేనని ప్రజలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related posts

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు

Satyam News

గీతా కృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Satyam News

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

రాఘవ్ చద్దా తొలగింపునకు అసలు కారణం ఏమిటి?

Satyam News

Leave a Comment