క్రీడలుహోమ్

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.

209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ చేధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఇషాన్ 32 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంకసర బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లోనే 82 పరుగులు బాది జట్టుకి విజయాన్ని అందించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 4 సిక్సలు, 9 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో శివమ్ దూబె మెరిశాడు. 18 బంతుల్లో 36 రన్స్ తో రాణించాడు. దూబె 3 సిక్సులు కొట్టాడు.

Related posts

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Satyam News

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News

తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా?

Satyam News

బంగారం వెండిపై భారీగా దిగుమతి సుంకం

Satyam News

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ పై ప్రశంసల జల్లు

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం

Satyam News

Leave a Comment