జాతీయంహోమ్

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

#PriyankaGandhi

పార్లమెంట్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నా ప్రధాని మోదీ సభలో స్పందించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రశ్నించాలని, పార్లమెంట్ ఎందుకు నడవడం లేదని ప్రతిపక్షాన్ని కాకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని మీడియాకు సూచించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడు రాజీనామా చేస్తారని, అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్ ఎందుకు జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించాలని అన్నారు. ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిపివేశారని, విద్యార్థులపై ఎన్‌ఎస్‌ఏ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నిస్తూ, విద్యార్థులను ఉగ్రవాదులుగా చూస్తున్నారా అని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts

ప్రకృతి ప్రసాదించిన ఔషదాల గని కాకర

Satyam News

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

Satyam News

మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్..

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

Leave a Comment