హైదరాబాద్హోమ్

పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం

#PonnamPrabhakar

టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో నార్సింగిలో ‘పట్టభద్రుల సమ్మేళనం – 2026’ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భీమ్ భరత్, నైనా జైశ్వాల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అర్హత ఉన్న పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను పార్టీ కార్యకర్తలు, నాయకులు చురుకుగా చేపట్టాలని సూచించారు.

హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా శ్రీధర్‌బాబు, మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా దామోదర రాజనరసింహ వ్యవహరిస్తున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని మంత్రి ఆరోపించారు. గతంలో 2001లో జరిగిన ప్రక్రియలో అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కూడా మంత్రి విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న పార్టీ అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతుందని తెలిపారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్న అర్హత కలిగిన పట్టభద్రులు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. పట్టభద్రుల సమస్యలు, హక్కుల కోసం శాసన మండలిలో బలమైన గొంతు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ పట్టభద్రులు ఉన్నారో పార్టీ కార్యకర్తలు గుర్తించి, వారికి ఓటు హక్కు నమోదు అయ్యేలా సహకరించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. పట్టభద్రులందరికీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకునేలా చూడాలని కోరారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పట్టభద్రుల ఓట్లు నమోదయ్యేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామిని చేయాలని సూచించారు.

Related posts

ఇరాన్ లో 170 సైనిక స్థావరాలు నేలమట్టం?

Satyam News

అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు

Satyam News

మొక్కజొన్న పంటను కొనుగోలు చేయండి

Satyam News

అమరావతిలో L&T పైపులకు నిప్పు పెట్టింది ఎవరు?

Satyam News

ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి

Satyam News

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

Satyam News

Leave a Comment