వరంగల్హోమ్

మహా జన సముద్రం గా మారిన మేడారం

మేడారం మహాజాతర భక్తజన సంద్రమైంది. వన దేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో మేడారం వైపు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి, ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరోవైపు జంపన్నవాగు భక్తజనంతో నిండిపోయింది. భక్తులు పవిత్ర జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. వాగు తీరమంతా శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.

సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం అడవులన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి.

Related posts

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….

Satyam News

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

Satyam News

ప్రధాన ఎన్నికల అధికారికి సుప్రీంకోర్టు నోటీసులు

Satyam News

మాచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Satyam News

Leave a Comment