ప్రత్యేకంహోమ్

అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

#NaraLokesh

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్‌. అమరావతిని మల్టీమీడియా హబ్‌గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్‌ రియాలిటీ థీమ్‌ పార్కులతో ట్రాన్స్‌ మీడియా నగరంగా అభివృద్ధి చేయడానికి క్రియేటివ్‌ ల్యాండ్‌ సంస్థతో గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్టు కోసం 10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో లక్షా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రముఖ డిజైనింగ్‌ సంస్థ.. కాన్వా ప్రతినిధులను కలిసి మంత్రి నారా లోకేశ్‌.. క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసే ఆటో డెస్క్‌ సీటీవో దేవ్‌ పటేల్‌తో మంత్రి లోకశ్‌ భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుఫానులను తట్టుకొనే భవన నిర్మాణాల కోసం సాంకేతిక సహకారం అందించాలని కోరారు.

అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని.. రిగెట్టి కంప్యూటింగ్ సంస్థ ముందు ప్రతిపాదనలు ఉంచారు మంత్రి లోకశ్‌. ఇప్పటికే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలను తీసుకురావడం ద్వారా.. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌ క్లౌడ్‌ సెంటర్‌గా నిలిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Related posts

బిజెపిలో చేరనున్న సినీ నటి ఆమని

Satyam News

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

Satyam News

మళ్లీ మొదలైన అమెరికా ఇరాన్ యుద్ధం

Satyam News

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

బంగ్లాదేశ్ లో మరో హిందూ కుటుంబం దారుణ హత్య

Satyam News

ఖమ్మం వైద్యుని సజీవ దహనం

Satyam News

Leave a Comment