ప్రపంచంహోమ్

వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఏకపక్ష మార్పులు?

#DonaldTrump

భారత్ తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా సవరించింది. ముఖ్యంగా అమెరికా ఉత్పత్తుల కొనుగోలు అంశంలో భాష మారింది. మొదటి ఫ్యాక్ట్ షీట్‌లో భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను “కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉంటుంది” అని పేర్కొనగా, తాజా వెర్షన్‌లో ఆ పదాన్ని సాఫ్ట్ చేసి భారత్ “కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉంది” అని మార్చారు.

ఇండో–యూఎస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అమెరికా వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసిన 24 గంటల లోపే సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దేశాలు ఫిబ్రవరి 6న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో లేని లేదా భిన్నంగా ఉన్న అంశాలు ఫిబ్రవరి 9న వైట్ హౌస్ విడుదల చేసిన వివరమైన ఫ్యాక్ట్ షీట్‌లో కనిపించాయి.

ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ షీట్‌ను మార్పులతో మళ్లీ అప్డేట్ చేశారు. డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అంశంలో కూడా మార్పు జరిగింది. ముందటి వెర్షన్‌లో భారత్ తన డిజిటల్ సర్వీసెస్ పన్నును “రద్దు చేస్తుంది” అని స్పష్టంగా ఉండగా, సవరించిన ఫ్యాక్ట్ షీట్‌లో ఆ ప్రస్తావన పూర్తిగా తొలగించారు.

వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిలో మార్పులు

వ్యవసాయ దిగుమతుల విషయంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్వపు ఫ్యాక్ట్ షీట్‌లో అమెరికా నుంచి పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుందని పేర్కొనగా, తాజా వెర్షన్‌లో పప్పుధాన్యాల ప్రస్తావన లేదు. అయితే సవరించిన ఫ్యాక్ట్ షీట్‌లో కూడా ఫిబ్రవరి 6 సంయుక్త ప్రకటనలో ఉన్న దానికంటే విస్తృతమైన వ్యవసాయ మార్కెట్ యాక్సెస్ ప్రస్తావన ఉంది.

అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులు మరియు డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రైన్స్ (DDGs), రెడ్ సార్గమ్, ట్రీ నట్స్, పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ వంటి పలు వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను “తొలగించేందుకు లేదా తగ్గించేందుకు” అంగీకరించిందని ఫ్యాక్ట్ షీట్ పేర్కొంది.

అయితే సంయుక్త ప్రకటనలో రెడ్ సార్గమ్ దిగుమతులు జంతు ఆహారంగా మాత్రమే పరిమితం అవుతాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రత్యేక నిబంధన వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌లో కనిపించలేదు. భారత్‌లో వ్యవసాయ దిగుమతులు, సుంక రక్షణలు రాజకీయంగా సున్నితమైన అంశాలుగా ఉండటంతో ఈ మార్పులు చర్చనీయాంశంగా మారే అవకాశముంది.

రష్యా చమురు కొనుగోలుపై ఇంకా సస్పెన్స్….?

ఫ్యాక్ట్ షీట్‌లో మరో అంశంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో, భారత దిగుమతులపై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని అమెరికా ఉపసంహరించుకోవడానికి అంగీకరించిందని పేర్కొన్నారు. భారత్ రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం అనుసంధానమైందని అమెరికా తెలిపింది.

అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాన్ని ఉపసంహరించుకుంటూ, భారత్‌పై ఉన్న పరస్పర సుంకాన్ని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అయితే భారత్ తన ఇంధన సరఫరా నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలు మరియు ఇంధన భద్రత అవసరాల ఆధారంగా ఉంటాయని స్పష్టం చేసింది.

సంయుక్త ప్రకటనతో పోలిస్తే వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌లో ఉన్న తేడాలు, అలాగే తక్కువ వ్యవధిలో చేసిన సవరణలు, భవిష్యత్తులో కుదిరే సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల్లో కీలకంగా పరిశీలించే అవకాశం ఉంది.

Related posts

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య  విస్త‌ర‌ణ ప‌నులు

Satyam News

సోషల్ మీడియాలో తోక ముడిచిన అబద్ధాల ముఠా

Satyam News

శ్రీ పద్మావతి అమ్మవారి  కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

Satyam News

కిషన్ రావుకు ఉద్వాసన

Satyam News

Leave a Comment