26.7 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్: ఇష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు

జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు.

ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాక్టర్‌కమ్‌, లైన్‌ప్రొడ్యూసర్‌ దశరధ్‌ మాధవ్‌ మాట్లాడుతూ మా కిల్లర్‌ టీమ్‌ డివైన్‌గా చేసిన మూవీ. ఒక ప్యాషన్‌తో ప్రతీ డిపార్ట్‌మెంట్‌ ఎంతో కష్టపడి చేశారు.

నేను స్పెషల్‌ గా థ్యాంక్స్‌ చెప్పాలంటే మా పూర్వజ్‌ సుక్కుసార్‌కి చెపుతాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక పనిని ఇష్టపడి కష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు అని నమ్మే వ్యక్తి సుక్కుసార్‌. సినిమా గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా గంటలు తరబడి కూర్చుని ఓపికగా పని చేస్తారు.

ఆ ప్రతిఫలమే కిల్లర్‌ మూవీ. ఇది ఒన్‌ మ్యాన్‌ షో అని చెప్పాలి. అదే విధంగా జ్యోతిగారి గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఈ మూవీ తరువాత ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. ఈ రోజున టెక్నాలజీని వాడుకుంటూ అన్ని క్రాఫ్ట్స్‌పైన ఒక మంచి అనుభవంతో తీసిన చిత్రమే కిల్లర్‌. మీతో జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.

జ్యోతిగారి గురించి చెప్పాలంటే ఈ చిత్రంలో నేను జ్యోతిగారి తమ్ముడి పాత్రలో కనిపిస్తాను. ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ ఉంటుంది. మీ కంపారిషన్‌ మీ కరేజియస్‌ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ కోసం బ్లడ్‌ అండ్‌ స్వెట్‌ పెట్టి పని చేశాం. ఎలాగైనా కొట్టాలని మంచి కాన్ఫిడెంట్‌గా పని చేశాము అన్నారు. చావా రేవా అన్నట్లు చేశారు అన్నారు.

Related posts

కేంద్రం చేతిలో కీలుబొమ్మ ఈ గవర్నర్

Satyam News

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

Satyam News

బిల్ గేట్స్ పర్యటన కోసం అంతా సిద్ధం

Satyam News

ఎలక్ట్రీషియన్ ఘాతుకం: భార్యను చంపి…

Satyam News

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News

Leave a Comment