30.3 C
Hyderabad
September 23, 2026
సినిమాహోమ్

నవమల్లెతీగ 100వ సంచికను ఆవిష్కరించిన మంత్రి సవిత

#MinisterSavitha

రెండు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతి, యువ, చందమామ వంటి పత్రికాసంస్థలు ప్రముఖ చిత్రకారుల ముఖచిత్రాలతో ఇలాంటి ప్రత్యేక సంచికలు వెలువరించేవని, నవమల్లెతీగ 100వ సంచిక చూస్తుంటే ఆనాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గురువారం అమరావతి-సచివాలయంలోని మంత్రి పేషీలో నవమల్లెతీగ 100వ సంచికను మంత్రి సవిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ- ప్రింట్ పత్రికలు కనుమరుగవుతున్న నేటి కాలంలో ప్రత్యేక సంచికను తీసుకురావడం గొప్ప సాహసమన్నారు. సాహిత్యాన్ని ప్రధానంగా చేసుకుని సాహితీవేత్తలతో పాటు యువతను, మహిళలను అన్నిరకాల పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా పత్రికను రూపొందిస్తున్న సీనియర్ సంపాదకులు కలిమిశ్రీ, ఆయనకు సహకరిస్తున్న ఎడిటోరియల్ బోర్డు సభ్యులు అభినందనీయులు అన్నారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, రాజధాని వార్తలు సంపాదకులు పఠాన్ హుస్సేన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు చొప్పా రాఘవేంద్రశేఖర్, వై. డి. ఆనంద్ పాల్గొన్నారు.

Related posts

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News

లైవ్ లో క్షిపణి దాడి… ఓ మై గాడ్..

Satyam News

మీడియాకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

దేశ భక్తికి నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్ పేయి

Satyam News

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News

Leave a Comment